భారత ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్. ఎంతంటి స్టార్ ఆటగాడైనా.. ఓ స్టేజ్ కి వచ్చాక గడ్డు పరిస్థితులను ఎదుర్కొక తప్పదన్నాడు. ఖచ్చితంగా విరాట్ ఫామ్ అందిపుచ్చుకుంటాడని ధీమా వ్యక్తం చేశాడు పాంటింగ్. అయితే అతనికి కొంత సమయం ఇవ్వాలని జట్టు మేనేజ్ మెంట్ కి సూచించాడు. టీ20 ప్రపంచకప్ లో కోహ్లీకి బదులు ప్రత్యామ్నాయ ఆటగాడిని తీసుకుంటే.. టీంఇండియాకి నష్టమేనని చెప్పకనే చెప్పాడు. టాప్ ఆర్డర్లో విరాట్ కి స్థానం కల్పిస్తే జట్టుకు మేలుచేస్తుందన్నాడు పాంటింగ్. ప్రత్యర్థి ఆటగాడిగా, సారథిగా నేనైతే కోహ్లీతో కూడిన టీమ్‌తో ఆడేందుకు భయపడాతానన్నాడు .
విరాట్ ఫామ్ పైటీంఇండియా మాజీ ఆటగాడు సయ్యద్ కిర్మాణీ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.టీ20 ప్రపంచ కప్ జట్టులో విరాట్ ఉండితీరాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. అతడోక గేమ్ ఛేంజర్ అని.. ఫామ్ అందిపుచ్చుకోవడానికి ఒక మ్యాచ్ చాలన్నాడు. అతను కమ్ బ్యాక్ ఇవ్వడానికి కొంత సమయం ఇవ్వాలని సూచించాడు. ప్రపంచకప్ లో అతని అనుభవం జట్టుకు మేలుచేస్తుందన్నాడు కిర్మాణీ.