దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం రౌద్రం రణం రథిరం(ఆర్ ఆర్ ఆర్) అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. అందుకు సంబంధించిన చిత్ర పోస్టర్ను సోమవారం విడుదల చేసింది. ఈ చిత్రంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కొమరం భీమ్ గా, జూనియర్ ఎన్టీఆర్ అల్లూరి సీతారామరాజుగా, నటిస్తున్న విషయం తెలిసిందే. వీరి సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్ నాయికలుగాన నటిస్తున్నారు.
చిత్రానికి సంబంధించి విడుదలైన పోస్టర్లలో రామ్ చరణ్ గుర్రంపై స్వారీ చేస్తూ, ఎన్టీఆర్ బైక్పై రయ్యిమంటూ దూసుకెళ్తున్నట్లు కనిపించడంతో అభిమానుల్లో జోష్ నెలకొంది.