సూర్యాపేట: నేరేడుచర్ల మండలం ముకుందాపురం గ్రామంలోని ఆంజనేయ స్వామి గుడిలో శ్రీ సీతారాముల వారి కల్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకకు గ్రామ ప్రజలు భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామి వారి సన్నిధిలో ప్రసాద వితరణ కార్యక్రమానికి చుట్టూ పక్కల గ్రామ పరిసరాల ప్రజలు హాజరై స్వామివారి దంపతులను శరణువేడారు.
ఇక సీతారాముల కల్యాణంలో భాగంగా గ్రామ మాజి సర్పంచ్ గంట మల్లా రెడ్డి,పగిడి నవీన్, కేశడి లక్సమారెడ్డి, గంట సురేష్ రెడ్డి, రఘురాములు, కే.తిరుపతయ్య జానకి రాములు తదితరులు హాజరై కార్యక్రమ నిర్వహణలో పాలు పంచుకున్నారు. సమస్త జగత్తుకు ఆదర్శనీయమైన సీతారాముల ఆశీస్సులు( దీవెనలు) గ్రామ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.