తొలి మ్యాచ్లో సన్ రైజర్స్ ఓటమి!

ఐపీఎల్‌ సీజన్ 14ను సన్ రైజర్స్ జట్టు  ఓటమితో ప్రారంభించింది. ఆదివారం ఆడిన తొలి మ్యాచ్‌లో ఆజట్టు10 పరుగుల తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ చేతిలో ఓటమిని చవిచూసింది. మొదట బ్యాటింగ్ చేసిన నైట్ రైడర్స్ జట్టు నితీశ్‌ రాణా (80; 56 బంతుల్లో 9×4, 4×6), రాహుల్‌ త్రిపాఠి (53; 29 బంతుల్లో 5×4, 2×6) చెలరేగడంతో  20ఓవర్లలో 187 పరుగులు సాధించింది. రషీద్‌ ఖాన్‌ (2/24) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశాడు. చేధనలో హైదరాబాద్ జట్టు మనీష్‌ పాండే (61 నాటౌట్‌; 44 బంతుల్లో 2×4, 3×6), బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5×4, 3×6) రాణించినా.. నిర్ణిత 20ఓవర్లలో 5 వికెట్లకు 177 పరుగులు మాత్రమే చేసింది. ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు పడగొట్టాడు.

జట్ల స్కోర్స్ వివరాలు :

కోల్‌కతా ఇన్నింగ్స్‌: నితీశ్‌ రాణా (సి) విజయ్‌ శంకర్‌ (బి) నబి 80; శుభ్‌మన్‌ (బి) రషీద్‌ 15; రాహుల్‌ త్రిపాఠి (సి) సాహా (బి) నటరాజన్‌ 53; రసెల్‌ (సి) పాండే (బి) రషీద్‌ 5; మోర్గాన్‌ (సి) సమద్‌ (బి) నబి 2; దినేశ్‌ కార్తీక్‌ నాటౌట్‌ 22; షకిబ్‌ (సి) సమద్‌ (బి) భువనేశ్వర్‌ 3; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 187

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4-0-45-1; సందీప్‌ శర్మ 3-0-35-0; నటరాజన్‌ 4-0-37-1; మహ్మద్‌ నబి 4-0-32-2; రషీద్‌ ఖాన్‌ 4-0-24-2; విజయ్‌ శంకర్‌ 1-0-14-0

సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌: సాహా (బి) షకిబ్‌ 7; వార్నర్‌ (సి) కార్తీక్‌ (బి) ప్రసిద్ధ్‌కృష్ణ 3; మనీష్‌ పాండే నాటౌట్‌ 61; బెయిర్‌స్టో (సి) రాణా (బి) కమిన్స్‌ 55; నబి (సి) మోర్గాన్‌ (బి) ప్రసిద్ధ్‌కృష్ణ 14; విజయ్‌ శంకర్‌ (సి) మోర్గాన్‌ (బి) రసెల్‌ 11; సమద్‌ నాటౌట్‌ 19; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 5 వికెట్లకు) 177

బౌలింగ్‌: హర్భజన్‌ 1-0-8-0; ప్రసిద్ధ్‌కృష్ణ 4-0-35-2; షకిబ్‌ 4-0-34-1; కమిన్స్‌ 4-0-30-1; రసెల్‌ 3-0-32-1; వరుణ్‌ చక్రవర్తి 4-0-36-0

Optimized by Optimole