సూపర్ స్టార్ మహేష్ బాబుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయనే ఈవిషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా తనకు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని… స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉండి.. వైద్యుల సలహాలు తీసుకుంటున్నట్లు మహేష్ చెప్పారు. ఇటీవల తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీకా తీసుకుంటే ఆస్పత్రిలో చేరే ప్రమాదం తక్కువగా ఉంటుందని.. అందుకే ప్రతీ ఒక్కరు టీకాలు తీసుకోవాలని… అలాగే కోవిడ్ నిబంధనలు కూడా కచ్చితంగా పాటించాలని మహేష్ బాబు ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు