దేశంలో కరోనా థర్డ్ వేవ్ శరవేగంగా విస్తరిస్తోంది. తాజాగా గురువారం ఒక్కరోజే 90 వేల పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అలాగే దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు 2 వేల 630కి పెరిగాయి. మహారాష్ట్రలో ఒక్కరోజే 36,265 కరోనా కేసులు వెలుగు చూడగా.. ఒక్క ముంబయిలోనే 20,181 కేసులు నమోదయ్యాయి. 8,907 మంది కోలుకోగా 13 మంది ప్రాణాలు కోల్పోయారు. ధారావిలో కొత్తగా 107 కేసులు వెలుగు చూశాయి.మరోవైపు వందకు చేరువలో ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 797కి చేరింది. 381 మంది ఒమిక్రాన్ నుంచి కోలుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
అటు దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కేసులు 15వేల మార్కు దాటాయి. కొత్తగా దేశరాజధానిలో 15097 కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. పాజిటివిటీ రేటు 15.34 శాతానికి చేరింది. వైరస్వ్యాప్తి నేపథ్యంలో నగరంలోని ఆక్సిజన్ బెడ్స్కు కూడా డిమాండ్ పెరుగుతోంది.
మరోవైపు స్వీయ నిర్బంధంలో ఉన్న కరోనా రోగులకు సంబంధించి జిల్లా స్థాయిలో ఏర్పాటు చేసిన కొవిడ్ కంట్రోల్ రూమ్స్ రోజువారి నివేదికలు సమర్పించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.