తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ ఫ్యామిలీ సుసైడ్ ఘటనలో ఏ2గా ఉన్న వనమా రాఘవను ఎట్టకేలకు భద్రాద్రి కొత్తగూడెం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా సరిహద్దుల్లోని దమ్మపేట వద్ద అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు. విశ్వనీయ వర్గాల సమాచారం మేరకు ఓ వాహనంలో రాజమండ్రి పారిపోతున్నారన్న సమాచారంతో రాఘవను ఛేజ్ చేసి దమ్మపేట పరిసరాల్లో అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పూర్తి స్థాయి విచారణ జరిపిన తర్వాత అతన్ని కోర్టులో హాజరు పరుస్తామని చెప్పారు.
కాగా పాల్వంచలో రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో తనపేరు వెలుగుచూసి నప్పటినుచి రాఘవ పరారీలో ఉన్నారు. రెండుసార్లు మీడియా ముందుకు వచ్చి తన తప్పులేదని చేప్పే ప్రయత్నం చేసినా… రామకృష్ణ సెల్ఫీ వీడియా వైరల్ తర్వాత పూర్తి అజ్ఞాతంలోకి వెళ్లారు.
గురువారం నాడు హైదరాబాద్‌లో వనమా రాఘవను అరెస్ట్ చేసినట్లు వార్తలు వచ్చినా… వాటిని ఖండించారు పోలీసులు. మరోవైపు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్లు స్వయంగా తన కుమారుడిని అప్పగించడానికి రంగం సిద్ధం చేసినట్లు కూడా న్యూస్ షికార్ చేసింది. అటు సీఎం కేసీఆర్ కూడా ఈ ఘటనపై ఆగ్రహంగా ఉండడంతో ఏక్షణమైనా రాఘవ అరెస్ట్ ఖాయమన్న హైడ్రామా కొనసాగింది. చివరకు రాఘవను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులే స్వయంగా వెల్లడించారు.
ఇక వనమా రాఘవ పెట్టిన ఇబ్బందుల వల్లే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్నట్లు స్వయంగా రామకృష్ణ తీసిన సెల్ఫీ వీడియో బయటకు రావడంతో పెను దుమారం చెలరేగింది. తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. దీంతో వనమా రాఘవను పార్టీ నుంచి టీఆర్ఎస్ సస్పెండ్ చేసింది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాలతో రాఘవను సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
మరోవైపు పాల్వంచ ఘటనతో వనమా రాఘవ పాత నేరాలు కూడా బయటకొస్తున్నాయి. పాల్వంచ రూరల్, టౌన్ పోలీస్ స్టేషన్లలో రాఘవపై ఏడు కేసులు ఉన్నాయి. జ్యోతి అనే గిరిజన మహిళకు చెందిన స్థలవివాదంలో వనమా రాఘవ అనుచరులు ఆమెపై భౌతికదాడికి పాల్పడ్డారని, ఆమెపై హత్యాయత్నం కూడా చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులోనూ రాఘవ A-1గా ఉన్నారు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలో ఉండి.. బెయిల్ సంపాదించి బయటతిరుగుతున్నారు. ఇలా చాలా ఏళ్లుగా రాఘవ అకృత్యాలకు
మొత్తానికి అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో రాఘవ అరెస్ట్ హైడ్రామాను పోలీసులు ముగించారు. అయితే అతనిపై పోలీసులు ఎంత పకడ్బందీగా కేసు నడిపిస్తారన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.