టీ20 ప్రపంచకప్ 2021 విజేతగా ఆస్ట్రేలియా నిలిచింది. ఎలాంటి అంచనాలు లేకుండా టోర్నీని ఆరంభించిన ఆసీస్.. తొలిసారి పొట్టి ప్రపంచకప్‌ను ముద్దాడింది. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్ పోరులో ఆజట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ రెండు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్ మార్ష్(77), డేవిడ్ వార్నర్(53) చెలరేగి ఆడారు. కివిస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్ (2/18) మినహా మిగతా బౌలర్లు విఫలమయ్యారు.
టాస్ గెలిచారు అంటే సగం మ్యాచ్ గెలిచినట్లే. ఈ నేపథ్యంలో టాస్ కీలకంగా మారింది. టాస్ నెగ్గిన ఆసీస్ తొలుత బౌలింగ్ ఎంచుకుని కివీస్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అయితే మొదట్లో ఆచితూచి ఆడిన న్యూజిలాండ్.. ఆఖర్లో మాత్రం దుమ్మురేపింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. దీంతో కివీస్ భారీ స్కోర్ ను ఆసీస్ ముందుంచింది. . ఆసీస్ బౌలర్లలో హేజిల్‌వుడ్ 3, జంపా ఒక వికెట్ పడగొట్టారు.
అనంతరం 173 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌కు ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బ తగిలింది.. కెప్టెన్ ఆరోన్ ఫించ్ త్వరగానే పెవిలియన్‌కు చేరాడు . అయితే ఆ ఆనందం కివీస్‌కు ఎక్కువ సేపు నిలవలేదు. డేవిడ్ వార్నర్‌తో కలిసి మిచెల్ మార్ష్ వీరవిహారం చేశారు. ఈ క్రమంలో ఇరువురు అర్ధశతకాలు నమోదు చేసుకున్నారు. విజయం ఖాయమైన సమయానికి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. ఆతర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన మ్యాక్స్‌వెల్ (28*)తో కలిసి జట్టును విజయపథంలో నడిపాడు.దీంతో ఆస్ట్రేలియా జట్టు తొలిసారి పొట్టి వరల్డ్ కప్ ను ముద్దాడింది. న్యూజిలాండ్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్ రెండు వికెట్లు పడగొట్టాడు