పొత్తుల మర్మమేళ?
APpolitics: ‘తానొకటి తలిస్తే.. దైవమొకటి తలచింది’ అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్‌లోని అధికార వైఎస్‌ఆర్‌సిపి పరిస్థితి. అవినీతి ఆరోపణలతో చంద్రబాబును రాజమండ్రి జైలుకు పంపించిన వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వానికి జనసేనాని పవన్ కల్యాణ్ టిడిపితో పొత్తు ప్రకటన చేసి రాజకీయ పంచ్ ఇచ్చారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడును పరామర్శించిన పవన్ కల్యాణ్ జైలు ప్రాంగణంలోనే రాబోయే ఎన్నికల్లో జనసేన- టీడీపీ కలిసికట్టుగా పోటీ చేస్తాయని ప్రకటిస్తూనే, ఎన్‌డిఎలో తాము భాగస్వామ్యంగా ఉన్నామని, బిజెపి కూడా తమ కూటమిలో చేరుతుందనే…