SheikhHasina: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను తరిమికొట్టారు..!
Nancharaiah merugumala senior journalist: ‘రజాకార్లు’ అన్నందుకే హసీనాను బాంగ్లా యువకులు ఇండియా తరిమికొట్టారు..హైదరాబాదైనా ఢాకా అయినా రజాకార్ అనేది ఇప్పుడు బూతు మాటే! 1940ల చివర్లో నాటి హైదరాబాద్ స్టేట్‌లోని తెలంగాణ ప్రాంతంలో ‘రజాకార్లు’ అంటే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలనకు మద్దతుగా నిలిచిన కిరాయి ముస్లిం సాయుధ గూండాలు. వారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పనిచేశారు. నిజాం పోలీసులను, పాలనను నిరసించిన ముస్లింలను సైతం రజాకార్లు వదలలేదు….