ఏపీసీసీ గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన..
విజయవాడ: బిజెపి ప్రభుత్వం రాహుల్ గాంధీపై అనర్హత వేటుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ నందు కాగడాల ప్రదర్శన నిర్వహించారు. ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం కళ్లుతెరవాలని ఆయన హితవు పలికారు. సస్పెండ్ చేసిన రోజునే రాహుల్ గాంధీని క్వార్టర్స్ కూడా ఖాళి చేయమని చెప్పడం దుర్మార్గపు చర్య అని రుద్రరాజు ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ, నగర అధ్యక్షులు…