అసలు అటేపు చూస్తారా?
దిలీప్ రెడ్డి ( సీనియర్ జర్నలిస్ట్): ఈ తరం ఎవరైనా…. వీటివైపు చూస్తున్నారా? ఇవి కొనడం, చదవటం కాకపోయినా, వీటి సారమేమని అయినా ఆలోచిస్తారా? ఎవరీ కార్ల్ మార్క్స్ ? ఏంటీయన బాధ! అనైనా అనుకుంటారా? ప్చ్, నాకైతే అనుమానమే! మానవేతిహాస గమనం గూర్చి…. అక్కడో, ఇక్కడో నాలుగక్షరాలు చదివితేగా … ఆయనెవరు? ఏంటి? తెలిసేది! ఆ మాటకొస్తే…. అసలు ‘చదవటం’ అనే లక్షణమే కనుమరుగవుతోంది ఈ తరం జనాల్లో! ఇది నా casual statement కాదు….