పురాతన భాష ఏది..?

నేను పరమాచార్య స్వామివారి దర్శనానికి మొదటిసారి శ్రీమఠానికి వెళ్ళినప్పుడు అక్కడ నలుగురు విదేశీయులు ఉన్నారు. ఒక ఇజ్రాయిలి, ఒక ఇటలీయుడు, ఒక జర్మనీయుడు, ఒక ఆంగ్లేయుడు. వారు ‘పాశ్చాత్య మరియు తూర్పు ఆసియాలో అత్యంత ప్రాచీన భాషలు’ అనే అంశంపై పి.హెచ్.డి చేయడానికి వచ్చారు. పాశ్చాత్య విభాగంలో లాటిన్, హీబ్రూ మరియు గ్రీకు భాషలు; తూర్పు ఆసియా విభాగంలో సంస్కృతము మరియు తమిళము అధ్యయనం చేస్తున్నారు.  మహాస్వామి వారు అనుష్టానం కొరకు లోపలికి వెళ్ళారు. వారు స్వామివారి…

Read More

దేవునికి తలనీలాలు ఎందుకు సమర్పించాలి..?

దేవునికి తలనీలాలు ఎందుకివ్వాలి? ఫలితం ఏంటీ? అనే సందేహం చాలామందికి వస్తుంటుంది. నిజానికి దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. తిరుమల దేవునికి కల్యాణకట్టలో భక్తులు తలనీలాలు సమర్పిస్తారు. శిరోజాలు పాపాలకు నిలయాలని పురాణాలు చెబుతున్నాయి. వాటిని తీసేయడం ద్వారా పాపాలను తొలగించుకుంటాం. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను…

Read More

జ్యేష్ఠ మాసం ప్రారంభం..

తెలుగువారు చాంద్రమానం అనుసరిస్తారు కాబట్టి కొత్త ఏడాది చైత్రంతో ప్రారంభమై ఫాల్గునంతో ముగుస్తుంది. తెలుగు నెలల్లో మూడోది జ్యేష్ఠం.చైత్ర , వైశాఖం తర్వాత వచ్చే జ్యేష్ఠ మాస పుణ్య కాలంలో చేసే పూజలు , జపాలు , పారాయణాదులకు విశేష ఫలముంటుందని శాస్త్రాలు పేర్కొంటున్నాయి. జ్యేష్ఠంలో విష్ణుసహస్రనామ పారాయణం అనంత ఫలాన్నిస్తుంది. అలాగే ఈ మాసంలో జలదానం చేయడం చాలా ఉత్తమం. జ్యేష్ఠశుద్ద తదియనాడు రంభా తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజున ప్రత్యేకంగా పార్వతి దేవిని పూజిస్తారు….

Read More

అక్షయ తృతీయ విశిష్టత!

భారతీయ పండుగలలో అక్షయ తృతీయ పర్వదినానికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ పండుగను వైశాఖ శుద్ధ తదియన హిందువులు, జైనులు జరుపుకుంటారు. శివయ్య అనుగ్రహంతో కుబేరుడు సంపదలకు రక్షకుడిగా నియమితుడైన రోజని.. మహాలక్ష్మిని శ్రీహరి వివాహం చేసుకున్న శుభదినంగా పేరుంది. ఈరోజు లక్ష్మీ దేవిని బంగారంతో అలంకరించి పూజిస్తే ఇల్లు సిరిసంపదలతో కలకళలాడుతుందన్నది భక్తులు నమ్మకం. అంతేకాకుండా ఈ రోజున చేసే యజ్ఞయాగాది క్రతువులూ, పూజలు, జపాలు దివ్యమైన ఫలితాలనిస్తాయని నమ్మకం. ఈ విషయాన్ని పార్వతీదేవికి శివుడు…

Read More

అరిషడ్వర్గాలు వివరణ!

కామ, క్రోధ, లోభ, మొహ, మద, మాత్సర్యాలను  అరిషడ్వర్గాలు అని అంటారు. ఈ అరిషడ్వర్గాలు కంటికి కనిపించని శత్రువులు వీటిని జయిస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. వివరణ : 1. కామము – ఇది కావాలి. అది కావాలి అని తాపత్రయ పడటం, అవసరాలకు మించిన అతిగా ప్రతిదీ కావలనే కోరికలు కలిగి యుండడము. 2. క్రోధము – కోరిన కోరికలు నెరవేరనందుకు చింతించుతూ, తన కోరికలు నెరవేరనందుకు ఇతరులే కారకులని భావించడం ఇతరులను నిందించడం వారిపై…

Read More

సూర్యమండల స్త్రోత్రం!

సర్వ పాపాల్ని హరించి పుణ్యఫలం ప్రసాదించే  సూర్యమండల స్త్రోత్రం. నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే | సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః || యన్మండలం దీప్తికరం విశాలం | రత్నప్రభం తీవ్రమనాది రూపమ్ | దారిద్ర్య దుఃఖక్షయకారణం చ | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం దేవగణైః సుపూజితం | విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ | తం దేవదేవం ప్రణమామి సూర్యం | పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ || యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం | త్రైలోక్య…

Read More

ఉగాది పచ్చడి- సంవత్సరాల విశిష్టత!

ఉగాది సంవత్సరాల నామాలు – వివరణ ఉగాది నూతన సంవత్సరం భారతదేశంలో తెలుగు మాట్లాడే ప్రజల కొత్త సంవత్సర వేడుక. ప్రతి యుగానికి 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ప్రతి ఉగాదికి జ్యోతిష శాస్త్ర ప్రభావాల ఆధారంగా పంచాంగంలో ఒక ప్రత్యేక పేరు ఉంది. ఈ ఉగాది నామ సంవత్సరం ఆ యొక్క సంవత్సరపు ప్రత్యేకతని తెలుపుతుంది. ఇలా 60 సంవత్సరాల పేర్లు ఉన్నవి. ఆ ఉగాది పేర్లు మీకోసం దిగువన ఇవ్వబడ్డాయి. అయితే ఈ 2021…

Read More

‘పంచ’ దంపతులు..!!

ఈప్రపంచంలో కోట్లాది కోట్ల దంపతులున్నా వాళ్ళ మనస్వత్వాలు మాత్రం భిన్నమైనవి. వాళ్ళంతా ఐదు విధాలుగానే ఉంటారని శాస్త్రం చెబుతున్న మాట! ప్రపంచంలో ఉన్న ఆ ఐదు జంటలు ఎవరంటే? 1. మొదటిది లక్ష్మీనారాయణులు విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది, అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై..ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో..ఆ జంట లక్ష్మీనారాయణుల జంట. 2.రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం తలనుంచి కాలిబొటన వ్రేలివరకు…

Read More

పుత్ర గణపతి వ్రతం !

పుత్ర సంతానం కోసం ‘పుత్ర గణపతి వ్రతం’ జరిపిస్తారని శాస్రాలు చెబుతున్నాయి. పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. పుత్ర సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు ఈ వ్రతం జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. చతుర్థి నాడు గణపతిని ఆరాధించడం వలన సంతానం కలుగుతుందని నమ్మకం. పుత్ర గణపతి  వ్రతం అంతరార్ధం!! శ్రీ పుత్ర గణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి).. ‘సాక్షాత్‌ రుద్ర…

Read More

సూర్యనమస్కారాల విశిష్టత!

ప్రపంచంలో అన్నింటికంటే పెద్ద ఐశ్వర్యం ఏమిటి అని అడిగితే అనుభవజ్ఞులు చెప్పేది ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉంటే చాలు అన్ని ఉన్నట్లే. కాబట్టి ప్రతీ ఒక్కరు కోరుకునేది జీవించినంత కాలం ఆరోగ్యంగా ఉంటే చాలు. అయితే మన సనాతనధర్మం ఎన్నో రహస్యాలను మంత్రాల రూపంలో, నమ్మకాలతో ఆయా క్రియలలో, నిత్యకృత్యాలలో నిక్షిప్తం చేసి మనకు అందించారు. కానీ మనం వాటిలో ఎక్కువ భాగం నిర్లక్ష్యం చేసి అనేక బాధలు పడుతున్నాం. అయితే ఆరోగ్యంగా ఉండటానికి పెద్దలు చెప్పిన వాటిలో…

Read More
Optimized by Optimole