ఆకాశానికి విల్లుఎక్కు పెట్టిన ప్రభాస్ .. అదిరిపోయిదంటూ డార్లింగ్ అభిమానులు రచ్చ..!!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా ఈ సినిమాను 500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రాముడిగా ప్రభాస్ సీతా పాత్రలో కృతిసనన్ కనిపించనున్నారు. ఇప్పటికే దసరా కానుకగా చిత్ర టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈనేపథ్యంలోనే డార్లింగ్ అభిమానుల కోసం ప్రత్యేకంగా టీజర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్రబృందం. మోకాళ్లపై కూర్చుని విల్లు ఆకాశానికి ఎక్కుపెట్టినట్లు…