saibaba: ఏమైపోతున్నాం..?
saibaba death: చట్టం ముసుగులో…. చట్టవ్యతిరేకంగా, రాజ్యాంగం పేరిట… రాజ్యదాష్టీకంతో ఒక మానవ హక్కుల కార్యకర్తను, సమాజహిత మేధావిని వెంటాడి, వేటాడి, నిర్బంధించి, హింసించి యాభయారేళ్లకే నూరేళ్లు నిండేలా మట్టుపెట్టిన హంతకులెవరు? ఆయనది సహజమరణం మాత్రం కాదు, ఇది జగమెరిగిన సత్యం! మరి ఈ హత్యను ఎవరి అకౌంట్లో వేద్దాం? ఇప్పుడెవరిని శిక్షిద్దాం? హంతకులు తప్పించుకుపోవాల్సిందేనా? ఎవరమూ నోరెత్తకపోతే ఎలా?? ‘వంద మంది నేరస్తులు తప్పించుకుపోయినా పరవాలేదు, ఒక నిరపరాధికి శిక్ష పడొద్దు’ అన్న సహజన్యాయ సూత్రమే…