BRS:‘సైన్యాధ్యక్షుడు’రాని యద్ధం.. నెగ్గేదెలా?
BRSParty: బీఆర్ఎస్ లో అంతర్మధనం..! ‘రాజకీయాల్లో ఆత్మహత్యలే తప్ప హత్యలుండవం‘ టారు. ఏడాది కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ప్రజామద్దతు కాంగ్రెస్ నిలబెట్టుకోకున్నా, ఓటమి నుంచి పాఠం నేర్చి బీఆర్ఎస్ పుంజుకోకున్నా, తద్వారా ఏర్పడే శూన్యంలోకి బీజేపీ విస్తరించకపోయినా… అది మూడు పార్టీలకీ రాజకీయ ఆత్మహత్యా సదృశమే! కాస్త హెచ్చు-తగ్గులతోనే అయినా… ముగ్గురి ముంగిటా ఇపుడు అవకాశాలున్నాయి. అంతా అయ్యాక, తమ దుస్థితికి ఎదుటివారొకరిని నిందించి ప్రయోజనముండదు. స్వయంకృతాపరాధం లేకుండా చూసుకోవడంలోనే నైపుణ్యం, విజయరహస్యం దాగి ఉంది….