cricket:“నీ పోటీ ప్రపంచంతో కాదు— నిన్నటి నీతో”
Sports: క్రికెట్‌లో కొన్ని ఇన్నింగ్స్‌లు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయి. కానీ సంకల్పంతో, సహనంతో, విమర్శల వర్షాన్ని తట్టుకుని ఆడిన ఇన్నింగ్స్‌లు మాత్రం అరుదు. టి20 ప్రపంచకప్ వేదికగా వెస్టిండీస్‌పై సంజూ శాంసన్ ఆడిన 97 పరుగుల ఇన్నింగ్స్ అలాంటిదే.సెమీఫైనల్ ఆశలు సజీవంగా నిలబెట్టుకోవాల్సిన ‘చావో రేవో’ మ్యాచ్‌లో తన బ్యాట్‌ను మాటగా మార్చుకొని ఆడిన తీరు ప్రశంసనీయం.ఆ రోజు అతను శతకం నమోదు చేయకున్నా సహనం ఉన్న చోటే నిజమైన గెలుపు పుడుతుందని నానుడి నిజం చేస్తూ…
