వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయి: జనసేన పవన్
సత్తెనపల్లి కౌలు రైతు భరోసా యాత్ర సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్..రైతుల పట్ల వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న ధోరణిని ఎండగట్టారు. ‘రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకొంటున్నారని.. ప్రకృతి విపత్తుల వల్ల నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కష్టాల్లో ఉన్నాం ఆదుకోండి అంటే వైసీపీ గాడిదలు ఓండ్ర పెడతాయన్నారు. వైసిపి నేతలు.. ప్రజల సమస్యల్ని గాలికొదిలేసి..వారాహి రంగేమిటి?టైర్లు ఎలా ఉన్నాయి? ఎత్తు ఎంత? అంటూ మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అధికారం రాని కులాలకు…