KishanRao: పరహితునకు ఎదురులేదు..నివాళి..!!
ఆర్. దిలీప్ రెడ్డి (సీనియర్ జర్నలిస్ట్): ఈయనకు ఇంత దైర్యం, సాహసం… నిజంగా ఎక్కడి నుంచి వచ్చాయి అని నాకు ఎప్పుడూ ఆశ్చర్యంగా ఉండేది. నేను జర్నలిజంలోకి వచ్చిన కొత్త రోజుల నుంచీ చూస్తున్నా! 80ల చివర్లో, 90ల ఆరంభంలో….. ఎన్ని నిరసనలు, ఆందోళనలు, ఉద్యమాలు నడిపారో! 88 యేళ్ల నిండు జీవితం ఒక సాహస ప్రయాణం! పటాన్ చెరు, దాని చుట్టుపక్కల జరిగిన చాల కాలుష్య వ్యతిరేక ఉద్యమాలకు డాక్టర్ ఏ కిషన్ రావు గారు…