మాఘ్ గణేష్ జయంతి విశిష్టత..
మాఘమాసంలో శుక్ల చతుర్థి రోజున మాఘ్ గణేష్ జయంతిని జరుపుకుంటారు. మాఘ వినాయక చతుర్థి.. మాఘ శుక్లా చతుర్థి.. తిల్కుండ్ చతుర్థి.. వరద చతుర్థి .. పేరు ఏదైనా ఈపండుగ రోజున గణనాథుడికి ప్రత్యేక అభిషేకాలు..హోమాలు.. పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ముఖ్యంగా మహారాష్ట్ర ,గోవాలో ఈ పండుగను ఎంతో ఉత్సాహాంగా,ఆనందంగా జరుపుకుంటారు.ఈరోజు గణపతికి ఎంతో ఇష్టమైన ఎరుపు రంగు గల మందార,కలువ పూలతో అలకరింస్తారు. జిల్లేడు పూలు,గరిక ,తుమ్మి.. బిల్వ పత్రాలతో పూజ చేస్తే అవరోధాలు…