Maharashtraelections: ‘మహా’సంగ్రామంలో గ్యారెంటీల గడబిడ..!

Maharashtraelection2024: మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ‘మహా’సంగ్రామం రసవత్తరంగా సాగుతున్న వేళ ఆ రాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు కూడా ఎన్నికల్లో కీలకాంశంగా మారుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని ‘మహాయుతి’, కాంగ్రెస్ నేతృత్వంలోని ‘మహా వికాస్ అఘాడీ’ కూటములు పోటాపోటీగా తలపడుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో పక్క రాష్ట్రాల గ్యారెంటీలు, పథకాలు, హామీలతో ఇతర అంశాలు కూడా ప్రచార అస్త్రాలవుతున్నాయి. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, కర్నాటక, గోవా సరిహద్దులుగా ఉన్న మహారాష్ట్రలో ఎన్నికలు తుది దశకు చేరుకుంటున్న సమయంలో ఏదో ఒక…

Read More

Maharashta2024: మ‌హా సంగ్రామంలో కీల‌కం రిజ‌ర్వ్‌డ్ స్థానాలు..!

Maharashtraelections2024: దేశంలో ప్రముఖ సామాజికవేత్తల ఉద్యమాలకు నెలవైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ ఓటర్లు కీలకమైన పాత్ర పోషించనున్నారు. డా.బీఆర్ అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, అథేవాలే, కాన్షీరాం వంటి ఎందరో ఉద్దండులను ఆదరించిన మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటును రిజర్వుడ్ స్థానాలే శాసించనున్నాయి. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లలో అధిక స్థానాలు సాధించనున్న కూటమికే అధికారం దక్కనుంది. 288 అసెంబ్లీ నియోజకవర్గాలున్న రాష్ట్రంలో మెజార్టీకి కావాల్సిన మాజిక్ ఫిగర్ 145 సాధించాలంటే 29 ఎస్సీ, 25 ఎస్టీ…

Read More

Indiaalliance: ‘ఇండియా’ కూటమికి బలం, బలహీనత… కాంగ్రెస్ ..!

నెలల వ్యవధిలో బలోపేతమైన ‘ఇండియా’ విపక్ష కూటమి 2024 సార్వత్రిక ఎన్నికల్లో పాలక ఎన్డీయేకు వెన్నులో చలి పుట్టించింది. ఇంకొంచెం ముందే జాగ్రత్తపడి, పకడ్బందీగా పొత్తులు కుదుర్చుకొని ఉంటే లోక్ సభలో బలాబలాలు నువ్వా-నేనా అన్నట్టుండేవి. అప్పటికీ, కేవలం 60 సీట్ల వ్యత్యాసం వరకు లాక్కువచ్చి రాజకీయ పండితులనే విస్మయపరిచారు. ‘ఇండియా కూటమి’ నూటాయాబై దాటదన్న పదహారు సర్వే సంస్థల అంచనాలను గల్లంతు చేస్తూ 234 సాధించారు. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ అని బీజేపీ నినదిస్తే,…

Read More

Minorityvotes: ముస్లీం ఓట్ల చుట్టూ ముగ్గుపోత..!

Muslimvoters: పలు అస్తిత్వాలు, భాషా వైవిధ్యాలు, మత-కుల ప్రభావాల సంఘమంగా ఉన్న మహారాష్ట్ర ఎన్నికల సముద్రంలో రాజకీయ పార్టీలు ఎత్తుగడల ఈదులాటతో ఓట్లవేట మొదలెట్టాయి. ఎక్కడ? ఏ ఊతం పట్టుకుంటే, అధిక ఓట్లు దక్కి విజయతీరాలు చేరుతామనే వ్యూహాల్లో తలమునకలై ఉన్నాయి. మూడేసి పార్టీలు జట్లు కట్టిన రెండు ముఖ్య కూటములు, ‘మహాయుతి’, ‘మహా వికాస్ అఘాడి’ (ఎమ్వీయే)లు ఇప్పుడిదే పనిలో నిమగ్నమయ్యాయి. ఒక వ్యూహం, దాదాపు 12 శాతంగా ఉన్న ముస్లీం మైనారిటీల ఓట్ల చుట్టూ,…

Read More

Maharashtra: ఆధిపత్య పోరులో…. ‘మహా’పీఠం దక్కేదెవరికో..?

Maharashtra elections2024: మహారాష్ట్రలో అయిదేళ్లుగా జరుగుతున్న రాజకీయ ట్విస్టులు, టర్నులూ… ఒక సూపర్ హిట్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. చీలికలతో చెల్లాచెదురైన పార్టీల మధ్య త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కూడా అంతే ఉత్కంఠగా సాగనున్నాయని ప్రస్తుత పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శివసేన, అజిత్ పవార్ ఎన్సీపీలతో కలిసి బీజేపీ ‘మహాయుతి’ కూటమిగా, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కలిసి కాంగ్రెస్ పార్టీ ‘మహా వికాస్ అఘాడి’…

Read More

Maharashtraelections: ఆర్ఎస్ఎస్ కేంద్రంగా ‘మహా’ సంగ్రామం..!

Maharashtra elections 2024: లోక్ సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు పొందలేకపోయిన బీజేపీకి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ఊపిరి పోస్తోంది. ఆర్ఎస్ఎస్ మీదా మేము ఆధారపడలేదని బీజేపీ జాతీయ అధ్యక్షులు జే.పీ నడ్డా పార్లమెంట్ ఎన్నికల సమయంలో డాంభికాలు పలికినా ఆ పార్టీకి ఫలితాలు వాస్తవికతను తెలియజేశాయి. ఎన్నికల్లో ‘అబ్కీ బార్ 400 పార్’ నినాదం ఎత్తుకున్న బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించలేక 240 వద్దనే చతికిలపడింది. అనంతరం పలు సందర్భాల్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మొహన్ భగవత్ బీజేపీ…

Read More

INC: ‘మహా’త్యాగం కాంగ్రెస్‌కు సాధ్యమా..?

Maharashtraelection2024: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్‌ పార్టీకి మరో అవకాశమే! అలసత్వం వల్ల హర్యానాలో చేజారిన అసెంబ్లీ గెలుపును ఒడిసిపట్టేందుకే కాకుండా కూటమిగా ‘ఇండియా’ను భవిష్యత్తులో బలోపేతం చేసేందుకు ఈ ఎన్నిక ఒక సవాల్‌. ఆ సవాల్‌ను స్వీకరించడానికి అవసరమైన గట్టి సైద్దాంతిక పునాది పార్టీకుంది. ఏఐసీసీ బెంగళూర్‌ ప్లీనరీ (2001) నుంచి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రుల మౌంట్‌అబూ భేటీ (2002) దాకా.. జరిగిన మేధోమధనంలో, రాజకీయ తీర్మానాల్లో, విధాన ప్రకటనల్లో చెప్పింది ఇపుడు ఆచరిస్తే చాలు! 2004…

Read More
Optimized by Optimole