ఎంజీఆర్ రికార్డును సమం చేయడం కేసీఆర్ కు సాధ్యమేనా ?
Nancharaiah merugumala senior journalist: దక్షిణాది రాష్ట్రాల్లో ఓ ప్రాంతీయపక్షం వరుసగా మూడు శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించడం తమిళనాడులో 1970లు, 80ల్లో సాధ్యమైంది. తమిళ మొదటి సూపర్ స్టార్ ఎంజీ రామచంద్రన్ వరుసగా 1977, 1980, 1985 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ ఏఐఏడీఎంకేను విజయపథంలో నడిపించారు. మూడుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. మొదటిసారి కేంద్రం అసెంబ్లీని రద్దుచేయడం వల్ల, మూడోసారి మరణం వల్ల ఎంజీఆర్ మూడుసార్లూ పూర్తి పదవీకాలం సీఎం పదవిలో కొనసాగలేకపోయారు….