NaaluPennungal: ‘విధేయన్’ కోసం తన్వీ ఆజ్మీ.. ‘నాలు పెన్నుంగల్’ కోసం నందితాదాస్..!
నాలుపెన్నుంగల్(నలుగురుస్త్రీలు): తగళి శివశంకర పిళ్లై మలయాళ సాహిత్యనిధి. వందల కథలు రాశారు. అందులోనుంచి నాలుగు కథలు ఎంపిక చేశారు మలయాళ ప్రసిద్ధ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్. కథలు నాలుగున్నాయి, వాటిని నాలుగు సినిమాలుగా తీయలేం! ఒకే సినిమాలో నాలుగు కథలు చూపించాలి. అందుకు తగ్గట్టు స్ర్కిప్ట్ రాసుకున్నారు. అది 2007 నాటి మాట. మలయాళ సినిమారంగంలో తొలి Anthology Filmకి అదే అంకురార్పణ అయి ఉండవచ్చు. ఇందులో ఏ కథకు ఆ కథ వేరుగానే ఉంటుంది. కథలన్నీ…