Tragicstory: ప్రార్థనలు చేస్తే ప్రాణాలు నిలుస్తాయా?
విశీ(వి.సాయివంశీ) : ఆ పాప పేరు భవ్యశ్రీ. వయసు 8 ఏళ్లు. తనది నెల్లూరు జిల్లా. కొన్నాళ్లుగా జ్వరంతో ఇబ్బంది పడుతూ ఉంది. రెండు నెలల క్రితం నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. స్కానింగ్ చేశాక తెలిసింది తనకు బ్రెయిన్ ట్యూమర్ అని. రూ.లక్షలు ఖర్చు పెడితే తప్ప పాప బతకదని డాక్టర్లు తేల్చేశారు. తల్లిదండ్రులు కలవరపడ్డారు. వాళ్లదేమైనా కలిగిన ఇల్లా, లక్షలు తేవడానికి? భవ్యతోపాటు మరో కూతురు, కొడుకు ఉన్నారు వాళ్లకి. అంతంతమాత్రం సంసారం. కానీ…