National: ప్రచారంలో దూకుడు.. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం!
National: Vootkur Pavan/senior journalist✍🏽 ప్రజలకు చేరువ కావడం ఒక రాజకీయ నైపుణ్యమైతే.. ప్రజల సమస్యలను ఆలకించి పరిష్కరించడం అంతకంటే గొప్ప పాలనా లక్షణం. ఎన్నికల వేళ ఓటర్లను ఆకట్టుకోవడానికి రాజకీయ పార్టీలు అనుసరించే వ్యూహాలు ఎన్నో. బహిరంగ సభలు, ఇంటింటి ప్రచారం, సంక్షేమ పథకాల వివరాలు, సోషల్ మీడియా ప్రచారాలు.. ఇలా ప్రజలకు చేరువయ్యేందుకు అనేక మార్గాలను అన్వేషిస్తుంటాయి. అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్యుడి సమస్యను వినే వ్యవస్థ ఎంత సమర్థంగా పనిచేస్తున్నదన్నదే పాలనకు…
