దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా..?

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. వారం రోజులుగా భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందలు, వేల నుంచి లక్షలకు కేసులు చేరుకుంటున్నాయి. ఏడు నెలల తర్వాత మరోసారి లక్షకు పైగా పాజిటివ్‌ కేసులు వచ్చాయి. మరోవైపు మహారాష్ట్ర, బెంగాల్‌, ఢిల్లీ, కేరళ, కర్ణాటకల్లో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. వీకేండ్‌లో పూర్తి ఆంక్షల అమలుకు పలు రాష్ట్రాలు సిద్ధమవుతున్నాయి. కాగా శనివారం ఒక్కరోజే లక్షా 17 వేల 100 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఏడు నెలల కాలంలో…

Read More

దేశంలో దడ పుట్టిస్తున్న కొత్త వేరియంట్!

దేశంలో ఓ వైపు డెల్టా, మరోవైపు ఒమిక్రాన్ వేరియంట్ దడపుట్టిస్తోంది. రోజు రోజుకు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల సంఖ్య వెయ్యి 892కు చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచే ఎక్కువ కేసులు ఉన్నాయి. మహారాష్ట్రలో 578, ఢిల్లీలో 382 ఒమిక్రాన్‌ కేసులతో టాప్‌ టూలో ఉన్నాయి. కేరళలో 185, రాజస్థాన్ 174, గుజరాత్ లో 152 కొత్త వేరియంట్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం 1,892 ఒమిక్రాన్ కేసులు నమోదు అయితే…..

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఒమిక్రాన్ వైరస్.. తెలంగాణలోను వణికిస్తోంది. గురువారం ఒక్కరోజే రాష్ట్రంలో అత్యధికంగా 14 ఒమిక్రాన్ కేసులు నమోదు కావడం, రాష్ట్రంలో కేసుల సంఖ్య 38కి చేరడం ఆందోళన కలిగిస్తోంది. ఈనేపథ్యంలో వైరస్‌ వ్యాప్తిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఒమిక్రాన్‌ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. పండుగలు, వేడుకల్లో జనం గుమిగూడకుండా చూడాలని, క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ వేడుకల్లో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.. జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సంక్రాంతి వేడుకల్లోనూ…

Read More

తెలంగాణాలో ఒమిక్రాన్ టెన్షన్..ఒక్కరోజే 14 కేసులు!

తెలంగాణాలో ఒమిక్రాన్ వేరియంట్ చాప కింద నీరులా వ్యాపిస్తోంది. తాజాగా మరో 14 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసులు సంఖ్య 38కి చేరినట్లు తెలిపింది. అటు గడిచిన 24 గంటల్లో 182 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కాగా నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చిన 12 మందిలో ఒమిక్రాన్‌ గుర్తించినట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది. రిస్క్‌ దేశాల నుంచి వచ్చిన ఇద్దరిలో ఒమిక్రాన్‌ వేరియంట్ గుర్తించినట్లు వెల్లడించింది. ఇప్పటివరకు…

Read More

ప్రమాదకరంగా ఓమిక్రాన్.. తాజాగా ఒకరు మృతి!

యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌.. దేశంలో చాపకింద నీరులా అన్ని రాష్ట్రాలకు విస్తరిస్తూ ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 200 కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. క్రిస్మస్‌, న్యూయర్‌ వేడుకల దృష్ట్యా.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. కరోనా నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు ఈ వేరియంట్ 12 రాష్ట్రాలు.. కేంద్రపాలిత ప్రాంతాలకు పాకడంతో.. 200 మంది ఒమిక్రాన్‌ బారినపడినట్లు…

Read More

దేశంలో ఓమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి పై ఆందోళన!

దేశంలో ఒమిక్రాన్ వేరియంట్‌ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేసులు సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. తాజాగా గుజరాత్​లో ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 145కు చేరింది. బ్రిటన్​ నుంచి ఆదివారం గుజరాత్​కు వచ్చిన ఓ వ్యక్తితో సహా బాలుడిలో ఒమిక్రాన్ వేరియంట్​ను గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వెంటనే ఆ ఇద్దరిని అహ్మదాబాద్​లోని ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. కాగా దేశంలోని 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒమిక్రాన్​ కేసులను ప్రభుత్వాలు గుర్తించాయి. అత్యధికంగా…

Read More

దేశంలో ఒమిక్రాన్ టెన్షన్.. సెంచరీ దాటిన కేసులు!

భారత్‌లో కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సెంచరీ కొట్టింది. డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దేశంలో 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ కేసులు 101కి చేరింది. అత్యధికంగా మహారాష్ట్రలో 32, దేశ రాజధాని ఢిల్లీలో 22 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక 11 రాష్ట్రాలకు పాకిన ఒమిక్రాన్ వైరస్ కేసులు.. 101కి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఒక్కరోజే కర్నాటకలో 5, తెలంగాణలో 4 కొత్త కేసులు…

Read More

దేశంలో గుబులు పుట్టిస్తోన్న ఒమిక్రాన్ వేరీయంట్!

భారత్‌నూ ఒమిక్రాన్ వేరియంట్‌ వణికిస్తోంది. పలు రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరుగుతుండగా.. దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 69కి చేరింది. అంతకంతకు పెరుగుతున్న కేసుల సంఖ్య గుబులురేపుతోంది. ఒమిక్రాన్ వ్యాప్తిపై అలర్ట్‌ అయిన కేంద్రం…విదేశీ ప్రయాణికులపై నిఘాపెట్టింది. ఆరు ఎయిర్‌పోర్టులో విదేశాల నుంచి వచ్చేవారికి RT-PCR టెస్టులను ముమ్మరం చేసింది. అటు తెలంగాణలోకి ఒమిక్రాన్ ఎంట్రీతో ప్రభుత్వం అప్రమత్తమైంది. రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసిన హైదరాబాద్​టోలిచౌకిలో వైద్యఆరోగ్య శాఖ హైఅలర్ట్ ప్రకటించింది.టోలిచౌకిలోని పారామౌంట్‌ కాలనీ టెస్టులను…

Read More

వణికిస్తోన్న ఒమిక్రాన్..ఒక్కరోజే 16 కేసులు!

ప్రపంచాన్ని వణికిస్తోన్న ఒమిక్రాన్‌ వేరియంట్‌…. దేశంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. మంగళవారం ఒక్కరోజే భారత్‌లో అత్యధికంగా 16 కేసులు వెలుగు చూశాయి. ఢిల్లీలో నాలుగు, రాజస్థాన్‌లో నాలుగు చొప్పున ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. మహరాష్ట్రలో ఎనిమిది కేసులు నిర్ధారణ అయ్యాయి. ఇందులో 7 కేసులు ముంబైలో.. మరో కేసు వాసాయి విహార్‌ శివారులో నమోదైనట్లు వైద్యాధికారులు వెల్లడించారు. తాజా కేసులతో కలిపి మహరాష్ట్రలో కేసుల సంఖ్య 28కి చేరింది. దీంతో దేశంలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 57…

Read More

దేశంలో పెరుగుతున్న ఒమిక్రాన్ కేసులు!

భారత్‌నూ ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తోంది. కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజే 17 కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. అటు.. బాధితుల సంఖ్య 21కి చేరింది. ఈ నేపథ్యంలో వేరియంట్‌ కట్టడికి కేంద్రం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది. అటు రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న…

Read More
Optimized by Optimole