 
        
            Elections: ‘‘ఒక దేశం- ఒక ఎన్నిక’’పై.. ఒక మాట..!
OneNation- one election: ‘భిన్నత్వంలో ఏకత్వం’ భారత లక్షణమే కాదు, విలక్షణ సంపద అని పలుమార్లు రుజువైంది. ‘ఒక దేశం ఒక ఎన్నిక’ ఉద్వేగ నినాదంగా బాగున్నంత, ఆచరణ గొప్పగా ఉంటుందనే నమ్మకం లేదు. ఇందులో పలు సమస్యలున్నాయి. దేశంలో రావాల్సిన ఎన్నికల సంస్కరణల్లో ఇదంత ప్రాధాన్యతాంశమేం కాదు! అంతకన్నా ప్రాధాన్యతగల అంశాలెన్నో దిక్కూ-దివాణం లేక ప్రజాస్వామ్యమే వెనుకడుగులోకి జారుతోంది. ముందా సంస్కరణలు ముఖ్యం. పదేళ్ల బీజేపీ, ‘తరచూ వాదనలు మార్చే’ (షిఫ్టింగ్ న్యరేటివ్స్) ఒరవడిలో భాగంగా…

 
                         
                         
                         
                         
                        