Telugu literature: నేటి సాహిత్యం..” చావడానికే బతుకు”..!

Telugu poetry : ” చావడానికే బతుకు”  మనం మన తాత ముత్తాతల అడుగుజాడల్లో చెట్లలా బతుకుతాం. పురిటిగది గూటిలో సాలీళ్లలా బతుకుతాం. దప్పిక అంచుల్లో మరులుగొంటాం. చావు పుట్టుకల నడుమ దయ్యాలకొంపలో కలలు కంటుంటాం. ఇంకా బతికి ఉన్నామేమో అనిపించేలా మనం చనిపోతాం. — వాయుయు మూలం: వీటో అపుషానా స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Poetry: నిన్నను క్షమించేద్దాం..!

Poetry:  నిన్నను క్షమించేద్దాం రేపటి రోజును నాశనం చేసే అవకాశాన్ని నిన్నకు ఇవ్వొద్దు. బాస రూపుమాసిపోతుంది. గొంతు ఊగిసలాడుతుంది. రాలిన ఆకుల చప్పుళ్లతో చెవులు గింగురుమంటుంటాయి. పొద్దు పొడిచే లోపే అవకాశానికి ఆటంకం ఎదురవుతుంది. నిన్నటి రోజును దాని మానాన గడచిపోనిద్దాం. కాలజాలంలోని కలనేతను కాసింత సడలించుదాం. రేపటి రోజును అదుపు చేయవద్దని నేటిని వేడుకుందాం. వెనుదిరిగి చూడనే చూడొద్దు. ఇక నిన్ను నడిపించేది నీ సంకల్పమే! — బాస్క్‌ మూలం: వీ ఫ్లమింగో స్వేచ్ఛానువాదం: పన్యాల…

Read More

Poetry: మూల్యం విలువ..!

Panyalajagannathdas:   మూల్యం.. ఏదీ ఆశించకుండా ఉండటం, దేనినీ జ్ఞాపకాల్లో దాచుకోకుండా ఉండటం, తిరిగి రావడానికి సొంత నేలనేది లేకుండా ఉండటం చాలా మంచిదని నాకు తెలుసు. అయితే, అలాంటి పరిస్థితుల్లో మనకు కవితలేవీ అర్థంకావు. నాకు బాగా తెలుసు నీలాంటి మంచి కవితలన్నిటికీ వాటి మూల్యం ఉంటుంది. మంచి కవితలన్నీ మన మనోవేదనను మూల్యంగా చెల్లించుకున్నాకే రూపు దిద్దుకుంటాయి. — ఆస్టురియన్‌ మూలం: జీ ఎం. సంచేజ్‌ స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు

Read More

Poetry: రాయడానికి ఒక చేయి చాలదు..!

Literature:  రాయడానికి ఒక చేయి చాలదు. ఈ రోజుల్లో రెండోది కూడా కావాలి. చెప్పలేని సంగతుల వంచనను చప్పున గ్రహించడానికి, వచ్చే ప్రళయం తర్వాత ఉదయించే తారక పేరును లిపిబద్ధం చేయడానికి, మోహవస్త్రంలోని వేలాది దారపు పోగుల అల్లిక తెగిపోకుండా చూడటానికి, వ్యర్థాల పోగు నుంచి మళ్లీ మొదలుపెట్టడానికి రెండో చేయి కూడా కావాలి. నిజానికి ఈ రోజుల్లో రాయడానికి రెండు చేతులూ చాలవు. కష్టాల తొక్కిడిలో నలిగిపోయి, ఈ నీచాతినీచ మరుభూమికి చేరుకోవలసిన అగత్యాన్ని రాయాలంటే,…

Read More
Optimized by Optimole