EENADU: ‘ఈనాడు’ అక్షరం, రేపటికి గవాక్షం..!
ఆర్. దిలీప్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్: యాభయ్యేళ్లు, అంటే… అర్థశతాబ్ది చరిత్ర ఈ మూడక్షరాలు! ఈనాడు తెలుగు సమాజంతో అయిదు దశాబ్దాలు నిండుగా మమేకమైన దినపత్రిక. సమాచారం, సందేశం, జ్ఞానం, వినోదం, వికాసం, చేతన, ప్రేరణ, సంస్కృతి, సహాయం, సాహిత్యం, భాష, బంధం…. ఒకటేమిటి? ఇలా లెక్కలేనన్ని విధాలుగా తోడ్పడుతూ తెలుగు వారి జీవితాలతో పెనవేసుకున్న అక్షరాల అనుబంధం ఈనాడు. దీర్ఘకాలిక వ్యూహం, పక్కా ప్రణాళికతో… యాబై యేళ్ల కింద, సరిగ్గా ఇదే తేదీ (ఆగస్టు 9)న,…