త్రివేణీ సంగమం (కన్నీటి నివాళి)..
నిబద్ధతకు… శ్రమ, నైపుణ్యం తోడు… సీహెచ్ వీ ఎమ్ కృష్ణారావు గారు చాలా పెద్ద పేరున్నజర్నలిస్టు. సౌమ్యుడు, మాకు ఇష్టుడు కూడా! మృత్యువు క్యాన్సర్ రూపంలో వెంటబడి తరమకుంటే ఇంకొన్ని సంవత్సరాలు తన మేధ, విచక్షణ, తార్కిక జ్ఙానంతో మంచి మంచి రాజకీయ విశ్లేషణలు చేసుండేవారు. మనం విని ఉండేవారమే! మనకా భాగ్యం లేకుండా పోయింది. ఓవరాల్‌గా ఆయనొక సమగ్ర జర్నలిస్టు కావడం వల్లే ఆయనకింత ఆదరణ, ఆయన వ్యాఖ్యలకు, సంభాషణలకు, చర్చలకు, విశ్లేషణలకు ఇంతటి ప్రాధాన్యత…