Headlines

ఓట్లు చీలడం వలనే టిఆర్ఎస్ గెలిచింది : రాజగోపాల్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్‌ మల్లన్నదే నైతిక విజయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అంగ,ఆర్ధిక బలం లేని సామాన్య వ్యక్తి టీఆర్‌ఎస్‌కు గట్టిపోటీ ఇచ్చాడని చెప్పారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విచ్చలవిడిగా డబ్బు,మద్యం పంపిణీ చేసిందన్నారు. విపక్ష అభ్యర్థుల అధికంగా పోటీ చేయడం వలన.. ఓట్ల చీలిక వల్లే టీఆర్‌ఎస్‌ గెలిచిందని  రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రానున్న సాగర్ ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ ఒడిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. పార్టీ మార్పుపై…

Read More

భాజపా ఆట మొదలుపెడితే దిమ్మతిరుగుతుంది: కిషన్ రెడ్డి

తెలంగాణ లో భాజపా ఆట మొదలుపెడితే అధికార తెరాసకు దిమ్మతిరగడం ఖాయమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి హెచ్చరించారు. తెరాస విమర్శలు చేస్తే చేతులు కూర్చోబోమని కిషన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఢిల్లీలోని తన నివాసంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేయడం కేసీఆర్కు, ఆయన కుటుంబ సభ్యులకు అలవాటుగా మారింది. రాష్ట్ర ప్రభుత్వాలను మోదీ అమ్మేస్తున్నారని ఆరోపిస్తున్నారు. నిజానిజాలు ఏంటో ప్రజలకు తెలుసు, తెలంగాణ రాష్ట్రాన్ని కొన్నట్టు కేసీఆర్ అండ్…

Read More

గ్రేటర్ పీఠం టీఆర్ఎస్ దే!

జిహెచ్ఎంసి కొత్త పాలక వర్గం గురువారం కొలువుదిరింది. కొత్తగా ఎన్నికైన 149 మంది కార్పొరేటర్లతో ప్రిసైడింగ్ అధికారి (హైదరాబాద్ కలెక్టర్)శ్వేతా మహంతి నాల్గు భాషల్లో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం మేయర్ ఎన్నిక నిర్వహించారు. అధికార టీఆర్ఎస్ నుంచి బంజారాహిల్స్ కార్పొరేటర్గా ఎన్నికైన గద్వాల విజయలక్ష్మి మేయర్ గా, డిప్యూటీ మేయర్ గా తార్నాక కార్పొరేటర్గా గెలిచిన మోతె శ్రీలత ఎన్నికయ్యారు. కాగా మేయర్ ఎన్నికకు టీఆరెస్ నుంచి విజయలక్ష్మి, బీజేపీ నుంచి రాధ పోటీపడ్డారు. మేయర్…

Read More

నల్గొండ జిల్లాకు కేసీఆర్ వరాలు!

సాగర్ ఉపఎన్నిక సమీపిస్తున్న వేళ నల్గొండ జిల్లాకు కెసిఆర్ వరాలు ప్రకటించారు. మంగళవారం ఎన్నికల పర్యటనలో భాగంగా పర్యటించిన ముఖ్యమంత్రి బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఉమ్మడి జిల్లాలోని 844 గ్రామ పంచాయతీలకు రూ.20 లక్షల చొప్పున, మండల కేంద్రాలకు 30 లక్షల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లు కెసిఆర్ తెలిపారు. నల్గొండ మున్సిపాలిటీకి 10 కోట్లు, మిర్యాలగూడ మున్సిపాలిటీకి కోట్లు, మిగతా మున్సిపాలిటీలకు కోటి చొప్పున నిధులు ప్రకటిస్తున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. వీటిని సీఎం ప్రత్యేక నిధి ద్వారా…

Read More

ముఖ్యమంత్రి మార్పు లేదు: సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం మార్పు గురించి జరుగుతున్న ప్రచారం పై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో నిర్వహించిన పార్టీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీఆర్ ముఖ్యమంత్రి అంటూ బహిరంగ సమావేశంలో మాట్లాడే నేతలకు చురకలు అంటిచారు. తాను రాజీనామా చేయాలని చూస్తున్నారా అని నేతలను ప్రశ్నించారు. ఇంకోసారి ఎవరైన ముఖ్యమంత్రి మార్పు పై మాట్లాడితే కర్రు కాల్చి వాతపెడతానని హెచ్చరించారు. మరో 10 ఏళ్ళు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టంచేశారు. ఈ నెల…

Read More

తెరాస ఎజెండా తెలంగాణ అభివృద్ధి: కె. కేశవరావు

తెలంగాణ ప్రయోజనాల కోసం ఎవరితోనైనా దోస్తీ కట్టేందుకు తాము సిద్ధమని తెరాస పార్లమెంటరీ నేత కె. కేశవరావు వెల్లడించారు. పార్లమెంటులో శనివారం అఖిలపక్ష సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ.. తమ ఏకైక ఎజెండా తెలంగాణ అభివృద్ధేనని.. రైతు చట్టాలను తాము తొలుత వ్యతిరేకించామన్నారు. కేంద్ర ప్రభుత్వం చట్టాల గురించి రైతులతో చర్చలు జరపడం సంతోషంగా ఉందన్నారు. ఇక దేశ రాజధానిలో రిపబ్లిక్ డే రోజు జరిగిన ఘటన దౌర్జన్యం అని ఒకరు ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఆ…

Read More

శ్రీరాముని పై టిఆర్ఎస్ నేత అనుచిత వ్యాఖ్యలు!

తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , టిఆర్ఎస్ నేత పిడమర్తి రవి శ్రీరాముని పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. శనివారం కరీంనగర్లోని ప్రజా సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజా పరిరక్షణ కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో గత రెండు రోజుల నుండి చందాల దందా మొదలైందని.. అయోధ్య రామ మందిర నిర్మాణ విరాళాల కోసం బిజెపి నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో దేశంలో జై భీమ్ _ జై శ్రీరామ్…

Read More

రాష్ట్రానికి ‘యువ’ ముఖ్యమంత్రి రాబోతున్నాడా..?

గత కొద్దిరోజులుగా తెలంగాణలో ముఖ్యమంత్రి మార్పు ఉంటుందనే ప్రచారం ఊపందుకుంది. అందుకు తగ్గట్టుగానే పార్టీ శాసన సభ్యులు, మంత్రులు వీలు చిక్కినపుడల్లా మాట్లాడే మాటలు చూస్తుంటే ప్రచారాలను కొట్టిపారేలేని అర్ధమవుతుంది. రెండు రోజుల కిందట ఓ మంత్రి ఓఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి మార్పు ఉంటే ఉండవచ్చు! తప్పకుండా! ఉంటే ఉంటదండీ!! ” అని వ్యాఖ్యానించారు. మంత్రి మాట్లాడిన మరుసటిరోజే పార్టీకి చెందిన ఓ మంత్రి, కొందరు ఎమ్మెల్యేలు సైతం ఇదే వ్యాఖ్యలు…

Read More
Optimized by Optimole