ఐపీఎల్ 2022లో గుజరాత్ టైటాన్స్ బోణీ..!

ఐపీఎల్ 2022లో కొత్త జట్ల మధ్య తొలి పోరులో లఖ్నవూ సూపర్ జెయింట్స్ పై గుజరాత్ టైటాన్స్ జట్టు పై చేయి సాధించింది. సోమవారం వాఖండే వేదికగా జరిగిన పోరులో 158 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన లఖ్నవూ సూపర్ జెయింట్స్ జట్టు.. దీపక్ హుడా(55), ఆయుష్ బదోని(54) అర్ధశతకాలతో చెలరేగడంతో 158 పరుగుల లక్ష్యాన్ని ప్రత్యర్థి జట్టు ముందుంచింది. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 3, వరుణ్ ఆరోన్ 2 వికెట్లు పడగొట్టగా.. రషీద్ ఖాన్ ఒక వికెట్ తీశాడు.

అనంతరం 158 పరుగుల లక్ష్యాన్ని గుజరాత్ టైటాన్స్ ఐదు వికెట్లు కోల్పోయి చేదించింది. ఆ జట్టులో తెవాటియా 40 పరుగులతో జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేశాడు. లఖ్నవూ సూపర్ జెయింట్స్ బౌలర్లలో చమీరా 2 వికెట్లు.. క్రునాల్ పాండ్య ,అవేష్ ఖాన్, దీపక్ హుడా తలా ఒక వికెట్ పడగొట్టారు.

Optimized by Optimole