కివీస్ పై గిల్ ‘ ఉప్పెన ‘ ఇన్నింగ్స్..భారత్ థ్రిల్లింగ్ విక్టరీ..!!

ఉప్పల్ వేదికగా కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు భారత యువ ఆశాకిరణం శుభ్ మన్ గిల్. ఫస్ట్ ఆఫ్ క్లాస్.. సెకండ్ ఆఫ్ మాస్ తరహలో హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు గుర్తుండిపోయేలా చారిత్రాత్మక ఇన్నింగ్స్ ఆడాడు. మరో ఎండ్ లో వచ్చిన బ్యాట్స్మెన్ వచ్చినట్లు పెవిలియన్ కి క్యూ కడుతున్న.. ఆత్మవిశ్వాసంతో డబుల్ సెంచరీ(208) బాదాడు. ఈ ఇన్నింగ్స్ తో వన్డేలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవడంతో పాటు అనేక రికార్డులను కొల్లగొట్టాడు.

ఇక ఉత్కంఠగా బరితంగా సాగిన మొదటి వన్డేలో..
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ జట్టు ఓపెనర్ గిల్ ధాటికి.. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో కివీస్ జట్టు 337 పరుగులకు అలౌటైంది. దీంతో భారత జట్టు 12 పరుగులతో విజయం సాధించింది. ఆ జట్టులో బ్రాస్ వెల్(140) మెరుపు సెంచరీతో మెరవగా.. ఆల్ రౌండర్ శాంటర్న్ హాఫ్ సెంచరీ తో రాణించాడు.

వెయ్యి పరుగుల క్లబ్లో గిల్..
ఇక భారత జట్టు తరపున తక్కువ ఇన్నింగ్స్ (19) లో వెయ్యి పరుగులు పూర్తి చేసిన మొదటి ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు.అంతేకాక డబుల్ సెంచరీ చేసిన ఐదో భారత ఆటగాడిగా నిలిచాడు.గతంలో సెహ్వాగ్, సచిన్, రోహిత్, ఇషాన్ కిషన్ ఈ ఫీట్ సాధించారు.