తెలంగాణలో బండి సంజయ్ అరెస్ట్‌ను మైలేజ్‌గా తీసుకున్న కమలనాధులు… కేసీఆర్ సర్కార్‌పై యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం కరీంనగర్ జైల్లో ఉన్న బండి సంజయ్‌ను… కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ సహా పలువురు నేతలు ములాఖత్ త్వారా పరామర్శించారు. జాగరణ దీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి నేరుగా బండి సంజయ్ క్యాంప్ ఆఫీస్‌కు వెళ్లారు. ఘటన వివరాలను స్థానిక నేతలను అడిగి తెలుసుకున్నారు.
అటు ఎంపీగా తన హక్కులకు భంగం కలిగించారంటూ లోక్ సభ స్పీకర్, కేంద్ర హోంమంత్రి, రాష్ట్ర గవర్నర్‌కు బండి సంజయ్ లేఖ రాయడంతో… లోక్ స్పీకర్ ఓంబిర్ల
స్పందించారు. 48 గంటల్లో పూర్తి రిపోర్టు ఇవ్వాలని కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో రాష్ట్ర సీఎస్, డీజీపీలకు నోటీసులు జారీ చేసింది హోంశాఖ. అరెస్టుపై పూర్తి సమాచారం 48 గంటల్లోగా ఇవ్వాలని ఆర్డర్ జారీ చేసింది. విచారణలో ఎంపీ బండి సంజయ్ వాదనలు కూడా తీసుకోవాలని సూచించారు స్పీకర్ ఓం బిర్లా.
మరోవైపు బండి సంజయ్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ విచారించలేనని తెలిపింది జస్టిస్ లక్ష్మణ్ బెంచ్. తన రిమాండ్‌ను రద్దు చేయలని పిటిషన్‌లో కోరారు. కరీంనగర్ కోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. తనపై తప్పుడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే రోస్టర్ విధానంలో ప్రజా ప్రతినిధుల కేసులు విచారించలేనని స్పష్టం చేసిన జస్టిస్ లక్ష్మణ్ బెంచ్. ఈ పిటిషన్‌ను సంబంధిత బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌ను కోరారు. ఇదే అంశాన్ని సంబంధిత బెంచ్‌కు నివేదించాలని పిటిషనర్‌కు సూచించారు.
.