Hyderabad: హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైన ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్)..

Hyderabad: దేశవ్యాప్తంగా ప్రసిద్ధ కళలకు, కళాకారులకు కేంద్రంగా నిలుస్తున్న హైదరాబాద్ నగరంలో జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ‘ఇండియా ఆర్ట్ ఫెస్టివల్’ (ఐఏఎస్) ఘనంగా ప్రారంభమైంది.ఇండియా ఆర్ట్ ఫెస్టి వల్- హైదరాబాద్ రెండవ ఎడిషన్ను అత్తాపూర్ కింగ్స్ క్రౌన్ కన్వెన్షన్లో కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిత్రలిపి కళాకారులు లక్ష్మణ్ ఏలే, జగదీష్ చింతల, దేవందర్ రెడ్డి, రచయిత ప్రయాగ్ శుక్లా, అంజు పొదార్ లు హాజరయ్యారు. ఈ ఏడాది ఫెస్ట్ వల్లో దేశవ్యాప్తంగా ఉన్న 25 ప్రముఖ ఆర్ట్ గ్యాలరీలు, 250 మంది కళాకారులు కలిపి 3000కి పైగా కళాఖండాను ప్రదర్శించారు. ఈ ప్రదర్శనలు భారతీయ కళా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయన్నారు.ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ గత రెండు సంవత్సరాలుగా హైదరాబాద్ లో కళను ప్రొత్సహించే ముఖ్య వేదికగా నిలుస్తుందని రమేష్ రెడ్డి అన్నారు. ఏప్రిల్ 4 నుంచి 6 వరకు జరుగుతున్న ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ హైదరాబాద్ రెండో ఎడిషన్ నగరాన్ని భారతదేశ కళా ప్రదర్శనలో మరింత ప్రాముఖ్యతను సంతరిం చుకునేలా చేస్తుందన్నారు.ఈ సారి ఫెస్టివల్లో ప్రత్యేకమైన 25 ఆర్ట్ గ్యాలరీ ఐ, 100 ఎయిర్ కండిషన్డ్ స్టాల్స్, దేశవ్యాప్తంగా 50 మంది దిగ్గజ ప్రముఖ యువ ఔత్సాహిక కళాకారులు రూపొందించిన 3,500 పైగా వైవిధ్యమైన ఈ ఆర్ట్ ఫెస్టివల్లో ప్రదర్శన చేశారు.ఆర్ట్ ఫెస్టివల్ తో పాటు ప్యూజన్, మ్యూజిక్ షోలు ఇతర ప్రదర్శనలు పెట్టారు.

జనరల్ సర్జన్, స్త్రీ వైద్య నిపుణులు డాక్టర్ జి. విజయ దుర్గ, వరంగల్ లోని ESI హాస్పిటల్  సివిల్ సర్జన్  స్పెషలిస్ట్ గా సేవలు అందిస్తున్నారు. ఈ ప్రదర్శనలో వారు గీసిన చిత్రపటాలను ప్రదర్శనకు పెట్టారు. చిత్రలేఖనం అభిరుచి చిన్నతనం నుండి వెన్నతో పెట్టిన విద్య అని ఈ వేదిక ద్వారా వారు స్వయంగా  వేసిన పెయింటింగ్స్ లను ప్రదర్శనలో పెట్టడం ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరికి ప్రత్యేక అభిరుచి ఉంటదని, ఉద్యోగం వేరు ఫ్యాషన్ వేరు అని వారన్నారు. దాదాపు 75 రకాల పెయింటింగ్స్ గీశామని, 40 రకాల పెయింటింగ్స్ ని ప్రదర్శనలో పెట్టామన్నారు. ఆసక్తి ఉన్నవాళ్లు కొనుక్కొని వెళ్తున్నారని 5000 నుంచి 10000 సాధారణ ధరలలో సేల్స్ చేస్తున్నామని చెప్పారు.

Optimized by Optimole