Tollywood:
హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి సంబంధించిన ప్రత్యేక డైరీను అల్లు అర్జున్ కి అందజేశారు. సినీ రంగానికి ఆయన అందిస్తున్న విశేష సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
మరోవైపు అల్లు అర్జున్ TFJA సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా తన ప్రయాణంలో కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఈ కార్యక్రమంలో TFJA సభ్యులు మరియు సినీ రంగ ప్రముఖులు పాల్గొన్నారు.
