telanganacabinet2023 :తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా ఎనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు 11మంది సీనియర్ నేతలు మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా నుంచి ఉత్తమ్ కుమార్, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, ఖమ్మం నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, కరీంనగర్ నుంచి పొన్నం ప్రభాకర్, సుదర్శన్ రెడ్డి, కొండా సురేఖ, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ మంత్రివర్గంలో ఉండనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో రేవంత్ తో సహ మంత్రులతో గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించబోతున్నారు.