Nancharaiah merugumala senior journalist:(ఇందిర కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ‘ఇండియా’లో, ఇద్దరు ‘భారత్’లో!)
‘ఇండియా దటీజ్ భారత్’ అనే మాటలు భారత రాజ్యాంగంలో ఉండబట్టే నెహ్రూ–గాంధీ–వాడ్రా కుటుంబానికి మంచి వెసులుబాటు దొరికింది. మాజీ సోషలిస్ట్, సెక్యులర్ ప్రధాని ఇందిరాగాంధీ పెద్ద కోడలు సోనియాగాంధీ, పెద్ద మనవడు రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యులుగా ‘ఇండియా’లో (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) ఉండగా, చిన్న కోడలు మేనకాగాంధీ, చిన్న మనవడు ఫిరోజ్ వరుణ్ గాంధీ ఎంపీలుగా ‘భారత్’లో (భారతీయ జనతాపార్టీ) పలుకుబడి కలిగిన నేతలుగా కొనసాగుతున్నారు. పండిత నెహ్రూ రాజకీయ తెలివితేటలకు వారసులుగా ఆయన కుటుంబసభ్యులు దేశంలోని రెండు ప్రధాన జాతీయపక్షాల్లో కొనసాగడం భారతీయుల ఆరోగ్యానికి, భద్రతకు మంచిదే. అన్ని రాజకీయ సిద్ధాంతాలను ఇముడ్చుకునే సామర్ధ్యం ఫస్ట్ ఫ్యామిలీ (నెహ్రూ)కి ఉంది. భారత ఏకైక డైనాస్టీకి ఉన్న ఈ స్వభావమే దేశానికి శ్రీరామ రక్ష. ఎం.మల్లికార్జున ఖర్గే వంటి వీర విధేయ దళిత కాంగ్రెస్ అధ్యక్షుడు సోనియా కుటుంబ ప్రయోజనాలు కాపాడుతుంటే… నెహ్రూ–గాంధీ ఫ్యామిలీ గంగా నదికి ఏ గట్టున ఉన్నా నష్టం లేదు. కాకపోతే ప్రధానమంత్రి పదవే చేతికి చిక్కడం ఆలస్యమౌతోంది.