Nancharaiah merugumala senior journalist:
తిరుమలలో బ్రాహ్మణ, రెడ్డి, కాపు, కమ్మ క్రైస్తవులకే ‘డిక్లరేషన్’ నిబంధన పరిమితం చేస్తే మంచిదేమో!
శ్రీవేంకటేశ్వరస్వామిపై తమకు విశ్వాసం ఉందని, ఆయనను దేవుడిగా పరిగణిస్తామనే… డిక్లరేషన్ తిరుమల కొండపై తిరుపతెంకన్న దర్శనం కోరే అన్యమతస్తులు ఇవ్వాలనే టీటీడీ నిబంధనను ఇక నుంచి..బ్రాహ్మణ క్రైస్తవులు, రెడ్డి క్రైస్తవులు, కాపు క్రైస్తవులు ( మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి గారు వంటి విశ్వాసులు), కమ్మ క్రైస్తవులకే ( దళిత క్రైస్తవ భార్య ఉన్న గుడివాడ తెలుగుదేశం ఎమ్మెల్యే వెనిగళ్ళ రాము గారు వంటి నేతలు) పరిమితం చేస్తే మంచిది. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ క్రిస్టియన్లు, ఓబీసీ, ఎస్సీ ముస్లింలను ఈ డిక్లరేషన్ నిబంధన నుంచి మినహాయిస్తే సామాజిక న్యాయ సూత్రాలకు అనుగుణంగా ఉంటుంది. అప్పుడు హిందూ సమాజంలోని వెనుకబడిన కులాలు, అనుసూచిత కులాలు, జాతుల వారు అన్య మతాలలో చేరరు. ఇండియాలో హిందువుల జనాభా 80 శాతానికి తగ్గకుండా ఉంటుంది.
ఇక ఎక్కువ జనాభా ఉండే ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలను క్రైస్తవంలోకి పోకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈమధ్య ఆర్.ఎస్.ఎస్, వీ.హెచ్.పీ వంటి సంస్థలు కూడా భావిస్తున్నాయి. మతఘర్షణల సమయంలో హిందూ సమాజానికి బీసీ, ఎస్సీ, ఎస్టీల అవసరాన్ని 2002 గుజరాత్ అల్లర్ల సమయంలో హిందుత్వ సంస్థలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో మతం మారిన బ్రాహ్మణులు వంటి హిందూ అగ్ర వర్ణాలు, రెడ్డి, కాపులు వంటి అగ్ర కులాల వ్యక్తులకే డిక్లరేషన్ నిబంధన వర్తింపచేయాలనేది మెజారిటీ తెలుగు హిందువుల అభిప్రాయంగా వినిపిస్తోంది.