Poetry :
వంకర నవ్వులు
దొంతర దంతాలు
ఒక దాని మీద ఒకటి వాలి ఉంటాయి-
సందడి చేసే ప్రియురాళ్లలాగ.
పలువరుసలోని దంతాలన్నీ
ఒకే వరుసలో ఉండాలని
నియమమేమీ లేదు.
ఏదో మోజు కొద్ది జనాలు
వంకర నవ్వులను
సవరించుకోవడానికి
పలువరుసలను
చక్కదిద్దుకుంటూ ఉంటారు.
—
ఫేరోయీస్ మూలం: పాలా గార్డ్
స్వేచ్ఛానువాదం: పన్యాల జగన్నాథదాసు