మహారాష్ట్రలో వీకెండ్ లాక్ డౌన్..

కరోనా సెకండ్ వేవ్ దృష్ట్యా మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వీకెండ్స్ లో(శుక్రవారం రాత్రి 8 నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు) లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజా పరిస్థితులపై ఆదివారం ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్ మీటింగ్ నిర్వహించారు. మీటింగ్ తర్వాత వీకెండ్ లాక్ డౌన్ పై ప్రకటన విడుదల చేసింది. ఎమర్జెన్సీ సర్వీసులు తప్ప , మిగతా వాటిని నిషేధిస్తూన్నామని,అందరూ కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని, ప్రభుత్వం హెచ్చరించింది. అంతేకాక ఎక్కడ ఎక్కువమంది గుమగూడరాదని స్పష్టం చేసింది. మాస్ రెస్టారెంట్లు సినిమా హాల్ల మూసివేత కొనసాగుతుందని తెలిపింది.
కాగా దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్క మహారాష్ట్ర మాత్రమే 60% కేసులతో మొదటి స్థానంలో ఉన్న విషయం తెలిసిందే.