×

Nancharaiah merugumala senior journalist:

‘నేను 2018లో తీసుకునే వరకూ టీవీ 9 ను నక్సలైట్‌ వ్యవస్థలా నడిపారు,’ అని …‘మైహోం’ జూపల్లి రామేశ్వర్‌ రావు గారు చెప్పాక కూడా మేనేజింగ్‌ ఎడిటర్‌ వెల్లలచెరువు రజనీకాంత్‌ జవాబివ్వరా?

సోమవారం కడ్తాల్‌ మండలం మహేశ్వర మహా పిరమిడ్‌లో జరిగిన పత్రీజీ ధ్యాన మహాయాగం ఉత్సవాల్లో పాల్గొన్న మైహోం గ్రూప్‌ అధిపతి డాక్టర్‌ జూపల్లి రామేశ్వర్‌రావు గారు తెలుగు ప్రజలకు తెలియని ఓ కొత్త విషయం వెల్లడించారు. ‘2018లో నేను టేకోవర్‌ చేసే వరకూ టీవీ 9 చానల్‌ ను ఒక నక్సలైట్‌ వ్యవస్థలా నడిపారు. భారత సంస్కృతి, ఆధ్యాత్మిక సాంప్రదాయాలంటే ఏ మాత్రం గౌరవం లేకుండా వ్యవహరించారు ఈ చానల్‌ సంపాదకులు. స్వర్గీయ బ్రహ్మర్షి సుభాష్‌ పత్రీజీని కించపరుస్తూ ఈ చానల్‌లో ప్రసారాలు నడిచాయి,’ అనే రీతిలో విరుచుకుపడుతూ మాట్లాడారు మైహోం కన్‌స్ట్రక్షన్స్, మహాసిమెంట్, టీవీ 9 చానల్‌ లో పెట్టుబడులు పెట్టి నడుపుతున్న జూపల్లి రామేశ్వర్‌ రావు గారు. హయత్‌ నగర్‌లో హోమియో డాక్టర్‌గా ప్రాక్టీసు ప్రారంభించిన నాలుగు దశాబ్దాలకు హైదరాబాద్‌ నగర శివార్లలో త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్‌ స్వామి వంటి ఆధ్యాత్మిక నేతలకు సైతం ఆశ్రయం ఇచ్చారు రామేశ్వరరావు గారు.

శ్రీమహావిష్ణువు ఆశీస్సులు ఉన్నాయని మరో పారిశ్రామికవేత్త తిక్కవరపు సుబ్బరామిరెడ్డి గారి నుంచి కిందటేడాది ప్రశంసలు కూడా అందుకున్న మైహోం గ్రూపు అధినేత– తాను కొనుగోలు చేయక ముందు టీవీ 9 ఎలా నడించిందీ, ఎలా నడిపారు? అనే విషయాలపై నిన్న లైవ్‌ లో సూటిగా, చక్కగా మాట్లాడడం సంచలనంగా మారింది. కాని, టీవీ 9ను రామేశ్వర్‌ రావు గారు టేకోవర్ చేయక ముందు నుంచీ ఈ చానల్‌ నిర్వహణలో కీలకపాత్ర పోషించారు ప్రస్తుత మేనేజింగ్‌ ఎడిటర్‌ వెల్లలచెరువు రజనీకాంత్‌ గారు. మరి ఇప్పుడు తన నాయకత్వంలో చక్కగా సాగుతున్న  టీవీ 9ను ‘నక్సలైట్‌ వ్యవస్థ’లా 2018కు ముందు కొందరు సీనియర్‌ జర్నలిస్టులు నడిపారని– చానల్‌ సహ యజమాని జూపల్లి రామేశ్వర్‌ రావు గారు బహిరంగంగా విమర్శించినా రజనీకాంత్‌ గారుగాని, ఆయనకు ఆసరాగా ఉన్న ఇతర సీనియర్లు గాని ఈ విమర్శకు జవాబిస్తూ ఒక ప్రకటన ఇంకా చేయకపోవడం చాలా మంది తెలుగు జర్నలిస్టులకు తీవ్ర దిగ్భాంతి కలిగిస్తోంది.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

DacoitReview: A Visually Rich Emotional Thriller That Falls Slightly Short of Its Potential

Dacoit Movie Review:  Rating: 3.25/5 By Anrwriting/ Film critic  Story: Dacoit revolves around Hari Das (Adivi Sesh), a man from a marginalized...

Read out all

tollywood: ఐకాన్ స్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన TFJA టీం…

Tollywood: హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా (TFJA) సభ్యులు కలిసి ఆయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా TFJA ప్రతినిధులు 2026 సంవత్సరానికి...

Read out all

“Biker Review: Style Over Substance in This Racing Drama”

BikerMovie Review: Rating : (2.75/5) By Anrwriting /Film Critic In an era where sports dramas often rely on emotional depth to leave...

Read out all

tollywood: ‘Kathanar’ Trailer Signals a Grand Cinematic Leap

Tollywood: Actor , known for redefining the scope of female-led cinema in India, appears poised to scale new heights with her upcoming...

Read out all

Telangana: ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ నివేదిక…

Telangana: భూమ్మీద ‘పేదరికం’ ఏ రూపంలో ఉన్నా నిర్మూలించాలని, ‘ఆకలి’ అనే శబ్దానికి తావులేని ప్రపంచం ఏర్పడాలని ఐక్యరాజ్యసమితి (యూఎన్) కోరింది. కీలకమైన ఈ రెండంశాలనే ఒకటి, రెండుగా పేర్కొంటూ...

Read out all
Optimized by Optimole