Nancharaiah merugumala (political Analyst):‘దేశభక్తి’ పేరుతో 50 ఏళ్ళు ఏలిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ‘ఇండియా’ పేరుతో సత్తా సాధిస్తుందా?
==========================
బహుసంఖ్యాకులు ‘అనుసరించే’ ‘మెజారిటీ’ హిందూ మతాన్ని ‘హిందుత్వ’ పేరుతో అడ్డం పెట్టుకుని పవిత్ర భారతంలో అధికారంలో కొనసాగుతోంది భారతీయ జనతా పార్టీ. భారత జాతీయ కాంగ్రెస్ అంతకు ముందు భారతమాత, దేశభక్తి అంటూ కమ్యూనిస్టులు, సోషలిస్టులు సహా ప్రతిపక్షాలన్నింటినీ దేశద్రోహులుగా చిత్రించి కొన్ని దశాబ్దాల రాజ్యమేలింది హస్తిన నుంచి. ఇప్పుడు ఆ పార్టీలనే ఒక చోట జమచేసి… దేశం పేరుతో (INDIA) జనాన్ని బురిడీ కట్టించాలని బెంగళూరులో పథకం పన్నింది Grand Old Party ఇందిరా కాంగ్రెస్. దళిత కుటుంబంలో పుట్టిన బుద్ధిస్టు మల్లికార్జున ఖర్గేను ముందు బొమ్మలా కూసోపెట్టి..శివభక్తుడూ, వడికిన నూలు పొగున్న సాద్బ్రాహ్మణుడు రాహుల్ గాంధీ ఇం.డి.యా అనే కొత్త ముసుగేసుకుని గెలుస్తాడా 2024లో? నరేంద్ర మోదీ అనే ఓబీసీ తెలీ ప్రధానిని 9 సంవత్సరాలుగా ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోపెట్టి మరాఠీ, ఉత్తరప్రదేశ్, బిహార్, హిమాచల్, ఉత్తరాఖండ్ బ్రాహ్మణ నేతలు (మోహన్ భాగవత్, జగత్ ప్రకాశ్ నడ్డా వంటి నాయకులు) బీజేపీని వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో గెలిపిస్తారా? ఈ ప్రశ్నలకు జవాబులు తెలియడానికి 10 నెలలు ఆగాల్సిందేనా?