ఐసీసీ వన్డే ర్యాకింగ్స్లో కోహ్లీ అధిపత్యానికి తెరపడింది. తాజాగా ప్రకటించిన ర్యాకింగ్స్‌లో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్, కోహ్లీని వెనక్కి నెట్టి అగ్రస్థానంలో నిలిచాడు. కోహ్లీ సుమారు మూడున్నరేళ్ల పాటు అగ్రస్థానంలో కొనసాగాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ ర్యాకింగ్స్‌లో బాబర్ 865పాయింట్లతొ అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. కోహ్లీ (857) ద్వితియ, రోహిత్ శర్మ (825) పాయింట్లతో మూడో స్థానంలో ఉన్నారు. పాకిస్తాన్ ఆటగాళ్లలో జావేద్ మియందాద్, జహీర్ అబ్బాస్ లతర్వాత వన్డేల్లో అగ్రస్థానానికి చేరుకున్న నాలుగో ఆటగాడిగా అజామ్ రికార్డు సృష్టించాడు.