Nancharaiah merugumala senior journalist:
“భారత చివరి బ్రాహ్మణ ప్రధానులు పీవీ, ఆటల్జీ హయాంలో అయోధ్య గుడి కట్టి ఉంటే..నలుగురు పీఠాధిపతులూ ప్రాణప్రతిష్ఠకు వచ్చేవారేమో! “
భారతదేశంలో చిట్ట చివరి బ్రాహ్మణ ప్రధ్రాన మంత్రులు పీవీ నరసింహారావు గారు, అటల్ బీహారీ వాజపేయి జీ పాలనాకాలంలో అయోధ్య రామజన్మ భూమిపై బాల రాముడి మందిరం నిర్మించి ఉంటే చాలా బాగుండేది. అంత గొప్ప పని.. దైవభక్తి కలిగిన మంచి బ్రాహ్మణ పాలకుల పర్యవేక్షణలో జరిగి ఉంటే… గెడ్డమున్న గుజరాతీ ఘాంచీ – తేలీ ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో పదిహేను ఇరవయ్యేళ్లు ఆలస్యంగా రాముడి గుడి ప్రారంభించాల్సిన అవసరం ఉండేది కాదు. పీవీ, వాజపేయి ఏలుబడిలో అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టి ఉంటే…దేశంలో నలు మూలలా ఉన్న నలుగురు పీఠాధిపతులైన శంకరాచార్యులు బేషరతుగా ఆ పుణ్య సమారోహానికి హాజరయ్యేవారు. ఓబీసీ ప్రధానమంత్రి అధికారంలో ఉండగా అయోధ్య రామాలయ నిర్మాణం.. ఎలాంటి విపరిణామాలకు దారి తీస్తుందోననే అనుమానం కొందరు హిందూ భారతీయులను పీడిస్తున్నట్టు కనిపిస్తోంది.