Newsminute24

AP: ప్రజల నమ్మకానికి నిదర్శనం… నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ: సతీష్ బాబు

తెనాలి, ఏప్రిల్ 26, 2026:
ప్రజల అవసరాలకు అనుగుణంగా సేవలు అందిస్తూ విశ్వసనీయతను నిలబెట్టుకుంటున్న నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ భవిష్యత్తులో మరింత విస్తరిస్తూ అనేక శాఖలను ప్రారంభించాలని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు ఆకాంక్షించారు.ఆదివారం తెనాలిలో నూతనంగా ఏర్పాటు చేసిన నందివెలుగు క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ ఏడవ శాఖ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సానా సతీష్ బాబుకు బ్యాంక్ ప్రతినిధులు లక్ష్మి కోటేశ్వరరావు, రామకృష్ణలు ఘన స్వాగతం పలికారు.అనంతరం ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి, రిబ్బన్ కట్ చేసి శాఖను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెనాలి వంటి ప్రముఖ పట్టణంలో ఏడవ శాఖ ప్రారంభించడం సంస్థ అభివృద్ధికి నిదర్శనమని తెలిపారు.

స్థానిక ప్రజలకు సులభంగా ఆర్థిక సేవలు అందుబాటులోకి తీసుకురావడమే ఈ సంస్థ లక్ష్యమని తెలిపారుప్రజల విశ్వాసాన్ని సంపాదించడం ఏ సంస్థకైనా అత్యంత ముఖ్యమని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బ్యాంక్ ముందుకు సాగుతోందని ప్రశంసించారు.భవిష్యత్తులో మరిన్ని శాఖలను ప్రారంభించే స్థాయికి బ్యాంక్ ఎదగాలని ఆకాంక్షిస్తూ సంస్థ నిర్వాహకులు లక్ష్మి కోటేశ్వరరావు, రామకృష్ణలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో చైర్మన్ తోట లక్ష్మీ కోటేశ్వరరావు, భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ, స్థానిక ప్రముఖులు, వ్యాపారవేత్తలు, బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు..

Exit mobile version