శ్రీలంకలో జరగనున్న ఆసియా కప్ టీ20 టోర్నమెంట్ రద్దయింది. ఈ విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా బుధవారం ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్నందున టోర్నీ నిర్వహించడం సాధ్యం కాదని శ్రీలంక క్రికెట్ చీఫ్ యాష్లే డిసిల్వా పేర్కొన్నారు. 2023లో వన్డే ప్రపంచ కప్ ముగిసిన తర్వాత ఆసియా కప్ టోర్నీ నిర్వహించాలని బోర్డు ఆలోచనలో ఉందని తెలిపాడు. మరోవైపు ఈ విషయంలో బీసీసీఐ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. వాస్తవానికి ఈ ఏడాది టోర్నమెంట్ పాకిస్థాన్‌లో జరగాలి కానీ.. భారత్- పాక్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా టోర్నీని శ్రీలంకకు మార్చారు.