BholaShankarreview: మెగా బాస్ చిరంజీవి నటించిన తాజా చిత్రం భోళాశంకర్. తమిళంలో ఘనవిజయం సాధించిన వేదాళం రీమేక్ గా దర్శకుడు మెహర్ రమేష్ ఈ మూవీని తెరకెక్కించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో సమీక్షలో తెలుసుకుందాం.
కథ: బతుకుదెరువు కోసం శంకర్ ( చిరంజీవి) తన చెల్లి( కీర్తి సురేష్) తో కలిసి కలకత్తా వస్తాడు. టాక్సీ డ్రైవర్ గా జీవితాన్ని గడుపుతుంటాడు. కాలేజ్ లో మహాలక్ష్మి తన క్లాస్ మెట్ శ్రీకర్ ( సుశాంత్) తో ప్రేమలో పడుతుంది. దీంతో శంకర్ ఇద్దరికీ పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ క్రమంలో మానవ అక్రమ రవాణాకు పాల్పడే మాఫియాను శంకర్ టార్గెట్ చేసి ఒక్కొక్కరిని చంపుతుంటాడు. అసలు శంకర్ మాఫియాను ఎందుకు టార్గెట్ చేయాల్సి వచ్చింది? కోల్కతా రాకముందు అతని గతమేంటి? శ్రీకర్_ మహాలక్ష్మీ పెళ్లి జరిగిందా? లేదా తెలియాలంటే సినిమా చూసి తీరాల్సిందే?
ఎలా ఉందంటే:
తమిళ్ బ్లాక్ బస్టర్ వేదాళం రీమేక్ భోళాశంకర్ కు చిరంజీవికి ఇమేజ్ కి తగ్గట్టు కథలో మార్పులు చేర్పులు చేశారు దర్శకుడు మెహర్. అయితే కథనం, స్క్రీన్ ప్లే పరంగా మెగాస్టార్ అభిమానులను మెప్పించడంలో మాత్రం దర్శకుడు బోల్తాపడ్డాడు. సినిమా ఫస్ట్ హాఫ్ సో సో గా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ లో టాక్సీ డ్రైవర్ గా చిరంజీవి పండిచే కామెడీ కొంత మేర మెప్పిస్తుంది. అయితే లాయర్లా స్య(తమన్నా)శంకర్ మధ్య వచ్చే సన్నివేశాలు మాత్రం ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోవు. ఇంటర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింది. సెకండ్ ఆఫ్ లో సిస్టర్ సెంటిమెంట్, యాక్షన్ సీన్స్, భావోద్వేగ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నటి శ్రీముఖితో చిరంజీవి చేసిన నడుం సీన్ తేలిపోయింది. ఫైనల్ గా ఫస్ట్ ఆఫ్ తో పోలిస్తే సెకండాఫ్ కొంతలో కొంత బెటర్ అని చెప్పవచ్చు.
ఎవరెలా చేశారంటే?
మెగాస్టార్ ఎప్పటిలానే తనదైన గ్రేస్, యాక్టింగ్ , కామెడీ తో అదరగొట్టేశాడు. ముఖ్య పాత్రలో నటించిన కీర్తి సురేష్ భావోద్వేగ సన్నివేశాల్లో నటనతో కట్టిపడేసింది.లాయర్ పాత్రలో కనిపించిన మిల్కీ బ్యూటీ తమన్నా ఉన్నంతలో ఆకట్టుకుంది. రఘుబాబు, వెన్నెల కిషోర్, జబర్దస్త్ నటులతో పాటు ఇతర నటీనటులు తమ తమ పాత్రల పరిధి మేర నటించి మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు:
దర్శకుడు మెహర్ చెప్పాలనుకున్న కథను ప్రజెంట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు.సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవల్. మహతి స్వర సాగర్ మ్యూజిక్ ఓకే. నేపథ్య సంగీతం ఫరవాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన భోళా శంకరుడు.
రివ్యూ: 2.25/5( రివ్యూ ప్రేక్షకుడి దృష్టి కోణంలో ఇవ్వబడినది)