Telangana: తెలంగాణ లోక్ సభ లో బీజేపీ హవా.. newsminute24 ట్రాకర్ పోల్ సర్వే..!

Loksabhaelections2024:   తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికల హడావుడి మొదలైంది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధిక సీట్లు గెలిచే అవకాశం ఉందన్న దానిపై పలు సర్వే సంస్థలు ప్రజానాడీ తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించే పనిలో నిమగ్నమయ్యాయి. తాజాగా newsminute24 వెబ్ సైట్ ట్రాకర్ పోల్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో బీజేపీ పార్టీ అధిక సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తేలింది. రెండవ స్థానంలో అధికార కాంగ్రెస్ పార్టీ నిలిచే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే వెల్లడించింది.

ఇక సీట్ల పరంగా చూస్కుంటే.. బీజేపీ 8 నుంచి 12 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే వెల్లడించింది. కాంగ్రెస్ పార్టీ   4 నుంచి 5 స్థానాలు .. బీఆర్ఎస్, ఎంఐఏం ఒక్కో స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది.  ఓట్ల శాతం పరంగా.. బీజేపీకి 42 % ఓట్లు. కాంగ్రెస్ పార్టీకి 31% ఓట్లు.. బిఆర్ఎస్ పార్టీకి 21%  ఓట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు newsminute24 సర్వే వెల్లడించింది.

ప్రధానిగా మూడోసారి మోదీకి పట్టం: 

Newsminute24 వెబ్ సైట్ సర్వే లో ప్రధానిగా ఎవరికి మద్దతిస్తారు అన్న ప్రశ్నకు ప్రజలు మోదీకి  పట్టం కట్టారు. అన్ని వర్గాల ప్రజలు మోదీ పనితీరు పట్ల సానుకూలంగా ఉన్నట్లు ట్రాకర్ పోల్  సర్వేలో తేలింది. ప్రధానిగా 58 శాతం ఓట్లతో  మోదీ మొదటి స్థానంలో నిలవగా..26 శాతం ఓట్లతో రాహుల్ గాంధీ రెండో స్థానంలో నిలిచినట్లు సర్వే లో వెల్లడైంది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 10 శాతం ఓట్లతో మూడో స్థానంలో.. 6 శాతం ఓట్లతో ఢిల్లీ సిఎం క్రేజీవాల్ నాలుగో స్థానంలో నిలిచినట్లు newsminute24 ట్రాకర్ పోల్ సర్వే రిపోర్ట్ చెబుతోంది.