Telanganapolitics: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ తొలి జాబితాను సీఎం కేసిఆర్ విడుదల చేశారు. ఏడు స్థానాల్లో అభ్యర్థులను మారుస్తున్నట్లు మీడియా వేదికగా ప్రకటించారు. నాలుగు స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీచేయబోతున్నట్లు తెలిపారు. నర్సాపూర్, జనగామ, గోష్ మహల్ స్థానాల్లో అభ్యర్థుల ఎంపికకు కొంత టైం పడుతుందని కేసిఆర్ స్పష్టం చేశారు.
ఇక సీఎం కేసిఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి పోటిచేయనున్నారు. గత ఎన్నికల్లో గజ్వేల్ నుంచి పోటీ చేసిన ఆయన ఈ సారి ఆస్థానం తో పాటు కామరెడ్డి నుంచి పోటీ చేయనున్నారు.